ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మధ్యలోనే ఆగిపోయిన ఇంజనీరింగ్ కౌన్సెలింగ్... ఆందోళనలో విద్యార్థులు - ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఆగిపోవటంతో విద్యార్థుల ఆందోళన

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ మధ్యలోనే ఆగిపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అయోమయంలో పడ్డారు. కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేసేస్తున్నారనే ప్రచారం మరింత ఆందోళనకు గురి చేస్తోంది.

engineering students are facing problems for counselling has stopped
మధ్యలోనే ఆగిపోయిన ఇంజనీరింగ్ కౌన్సెలింగ్... ఆందోళనలో విద్యార్థులు

By

Published : Nov 9, 2020, 9:42 AM IST

Updated : Nov 9, 2020, 1:24 PM IST

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ మధ్యలోనే ఆగిపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అయోమయం నెలకొంది. కళాశాలల అనుబంధ గుర్తింపు పూర్తికాకపోవడం, బోధన రుసుములపై ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో కౌన్సెలింగ్‌పై అస్పష్టత ఏర్పడింది. కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్లు భర్తీ అయిపోతుందని విద్యార్థుల్లో ఆందోళన ఉంది. కన్వీనర్‌ కోటాలో కోరుకున్న బ్రాంచిలో సీట్లు ఉంటాయో లేదోననే గందరగోళం నెలకొంది.

కళాశాలల ప్రవేశాల జాబితా... కన్వీనర్‌కు చేరకపోవడంతో ధ్రువపత్రాల పరిశీలన నిలిపివేసి, సహాయ కేంద్రాలు మూసివేశారు. గడువు ముగియడంతో ప్రాసెసింగ్‌ రుసుము చెల్లించేందుకే అవకాశం కల్పిస్తున్నారు. కళాశాలలు, కోర్సుల ఎంపిక ఐచ్ఛికాలకు అవకాశం కల్పించలేదు. రాష్ట్రవ్యాప్తంగా 86,869 మంది ప్రాసెసింగ్‌ రుసుము చెల్లించి, ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్నారు. వీరిలో 85,702 మంది కళాశాలల ఎంపికకు అర్హత సాధించారు.

Last Updated : Nov 9, 2020, 1:24 PM IST

ABOUT THE AUTHOR

...view details