విజయవాడలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువతి నగరంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో నాల్గొవ సంవత్సరం చదువుతోంది. తరుణ్ అనే యువకుడు.. ప్రేమ పేరుతో తన సోదరిని మోసం చేశాడని మృతురాలి సోదరుడు సునీల్ ఆరోపించారు. స్నేహితురాలితో కలిసి రూంలో ఉంటున్న నా చెల్లిని తన రూంకు తీసుకెళ్లాడని.. కొన్ని రోజులుగా కలిసే ఉన్నారని సునీల్ పేర్కొన్నాడు. అయితే ఈనెల 23న.. మీ చెల్లి ఆత్మహత్యాయత్నం చేసుకుందని తరుణ్ ఫోన్ చేశాడని సునీల్ తెలిపాడు. గాయపడ్డ యువతిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చిన తరుణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. యువతి నాలుగు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఇవాళ మృతి చెందింది.
విజయవాడలో ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
17:58 July 26
ప్రేమ పేరుతో తరుణ్ వంచించాడని యువతి సోదరుడి ఆరోపణ
కొట్టడం వల్లే మృతి..
నిందితుడు తరుణ్ కొట్టటం వల్లే యువతి మృతి చెందిందని.. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి.
CM Jagan: 'వ్యవసాయ రంగం ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి'
Last Updated : Jul 26, 2021, 8:55 PM IST