ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో ప్రవేశాల ప్రక్రియ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సురేశ్ తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన సైతం ఆన్‌లైన్‌లో జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.
నవంబర్ 15 నుంచి తరగతులు
ఈనెల 25 నుంచి 30 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, ఫీజు చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 26 నుంచి 31 వరకు అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్న మంత్రి..నవంబర్ 1 నుంచి 5 వరకు విద్యార్థులు ఇంజినీరింగ్, ఫార్మసీ వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చునని వెల్లడించారు. ఆప్షన్ల మార్పునకు నవంబర్ 6న అవకాశం ఇచ్చామని వివరించిన మంత్రి... నవంబర్ 10న ఇంజినీరింగ్, ఫార్మసీ సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. నవంబర్ 15 నుంచి ఇంజినీరింగ్, ఫార్మసీ తరగతులు మెుదలవుతాయని మంత్రి సురేశ్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:local bodies elections: ఎన్నికలు జరగని స్థానిక సంస్థలకు వచ్చే వారం నోటిఫికేషన్