రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరత సమస్య తాత్కాలికమేనని.. ఈ నెల చివరికల్లా దీన్ని అధికమిస్తామని ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ తెలిపారు. 2014-15 నుంచి ఏడాదికి విద్యుత్ వినియోగంలో పెరుగుదల 6 శాతం ఉంటే 2021కి 14 శాతానికి పెరిగిందన్నారు. అక్టోబర్ నుంచి దేశంలో బొగ్గు కొరత ఉందన్న ఇంధన శాఖ కార్యదర్శి.. బొగ్గు సరఫరాలో ఎక్కడా ఇబ్బందులు లేవన్నారు.
'అప్పటి వరకు విద్యుత్ సమస్యను పరిష్కరిస్తాం' - ap latest news
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యను ఈ నెల చివరి నాటికల్లా అధిగమిస్తామని ఇందన శాఖ కార్యదర్శి తెలిపారు. అక్టోబర్ నుంచి దేశంలో బొగ్గు కొరత ఉందని విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు.
ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్
2024 వరకు 7 వేల మెగావాట్ల కోసం సెకీతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఉందని శ్రీధర్ తెలిపారు. 2014-15 వరకు డిస్కంలు తెచ్చిన రుణాలు రూ.30 వేల కోట్లు ఉన్నాయని అవి 2018-19 నాటికి రూ.62 వేల కోట్లకు పెరిగాయన్నారు. అనంతరం విద్యుత్ కోతలు, బకాయిలపై అడిగిన ప్రశ్నలను ఇంధన శాఖ కార్యదర్శి దాటవేశారు. వాటిపై తరువాత సమాధానం చెబుతామన్నారు.
ఇదీ చదవండి:'అప్పటి వరకూ విద్యుత్ సమస్య ఉంటుంది'