ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపటి విద్యుత్​ డిమాండ్​ ఈ రోజే అంచనా! - డిస్కంలు తాజా వార్తలు

విద్యుదుత్పత్తి, వినియోగం మధ్య సమతుల్యత సాధించటానికి ఇంధన శాఖ సాఫ్ట్​వేర్‌ను అభివృద్ధి చేసింది. రాష్ట్రంలో వచ్చే 24 గంటల్లో ఉండే విద్యుత్తు డిమాండ్‌ను ముందే అంచనా వేస్తుంది. ఈ వ్యవస్థ మూడు వారాల్లో అందుబాటులోకి రానుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ 98శాతం కచ్చితత్వంతో వాస్తవ వినియోగాన్ని అంచనా వేస్తుంది. ఈ తరహా ప్రయత్నం దేశంలోనే మొదటి సారి.

Energy Department developing software for electricity demand
Energy Department developing software for electricity demand

By

Published : Jun 9, 2020, 9:12 AM IST

సాధారణంగా రాష్ట్రంలో రోజుకు 150-200 మిలియన్‌ యూనిట్ల మధ్య విద్యుత్తు డిమాండ్‌ ఉంటుంది. డిస్కంలు రోజువారీ డిమాండ్‌ ఆధారంగా రేపటి విద్యుత్తు డిమాండ్‌ను నేడే అంచనా వేసి ఉత్పత్తి సంస్థలకు ప్రతిపాదన పంపుతాయి. ఆ మొత్తం ఉత్పత్తిని డిస్కంలు తీసుకోవాలి. ఒక వేళ తీసుకోకున్నా ప్రతిపాదిత యూనిట్లకయ్యే మొత్తం సొమ్మును ఉత్పత్తి సంస్థలకు చెల్లించాలి. వాడుకోకున్నా చెల్లించడం డిస్కంలకు భారంగా మారింది. అందుకే ఈసాఫ్ట్‌వేర్‌ రూపకల్పనకు యోచించింది. వాతావరణ పరిస్థితులు, గత రెండేళ్లలో అదే రోజు వినియోగం.. వంటివి క్రోడీకరించి సాఫ్ట్‌వేర్‌ డిమాండ్‌ను అంచనా వేస్తుంది. ఈ అంచనాలనే డిస్కంలు ఉత్పత్తి సంస్థలకు ప్రతిపాదిస్తాయి. ఐఐటీ ముంబయి నిపుణుల సహకారంతో విద్యుత్తు శాఖ సిబ్బంది సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. ప్రస్తుతం పరిశీలనలో ఉందని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details