ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Vani Mohan: 'దుర్గగుడి అంతరాలయ దర్శన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటాం' - దేవాదాయశాఖ తాజా వార్తలు

దేవాలయాల చరిత్రను యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ స్పష్టం చేశారు. దుర్గగుడిలో అంతరాలయ దర్శనాలపై భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై స్పందించిన ఆమె.. వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

దుర్గగుడి అంతరాలయ దర్శనాలపై ఫిర్యాదులు..పరిశీలించి చర్యలు తీసుకుంటాం
దుర్గగుడి అంతరాలయ దర్శనాలపై ఫిర్యాదులు..పరిశీలించి చర్యలు తీసుకుంటాం

By

Published : Oct 9, 2021, 4:42 PM IST

ఇంద్రకీలాద్రిపై అమ్మవారి అవతారాలను విగ్రహ రూపంలో ఏర్పాటు చేశామని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ తెలిపారు. దేవాలయాల చరిత్రను యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ గాయత్రి దేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని ఆలయాలలోనూ ధర్మపథం కార్యక్రమలు జరుగుతున్నాయని, దేవాలయ ఉద్యోగులు, ప్రజలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

దుర్గగుడిలో అంతరాలయ దర్శనాలపై భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ఆమె స్పందించారు. వీవీఐపీలు కానివారిని సైతం అంతరాలయంలోకి తీసుకువెళ్తున్నారని, రూ.300 రూపాయల టిక్కెట్ వారికి ముఖమండప దర్శనంతోనే పంపేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సామాన్య భక్తుల నుంచి అందరికి అమ్మవారికి దర్శనం కల్పిస్తున్నామని వాణీ మోహన్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details