భక్తులే ప్రధానంగా.. దేవాలయాల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు(Endowment principal secretary vani mohan on temples) దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్ తెలిపారు. దేవాలయాల్లోని ఆయా భగవంతులకు సంబంధించిన శ్లోకాలు, మంత్రాలు వినిపించేలా చర్యలు చేపడుతున్నట్లు ఆమె వివరించారు. అన్ని దేవాలయాల వద్ద పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్న ఆమె.. దేవాలయాలకు విరాళాలు ఇచ్చేందుకు ఈ-హుండీ ఏర్పాటు చేస్తామన్నారు. 'భక్తులు మనఃశాంతి, మొక్కులు కోసం వస్తారని.. అలాంటి వారికి ఇబ్బందులు పెట్టకుండా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాం. దేవాలయాల ఆభరణాలు, ఆస్తులను కాపాడేందుకు ఆ వివరాలు కంప్యూటరైజ్ చేశాం. రాష్ట్రంలో దేవాలయాల పునరుద్ధరణకు టీటీడీ కూడా ఆర్థిక సహకారం అందిస్తోంది' అని ఆమె వివరించారు.
త్వరలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం..
భక్తుల మనోభావాలు కాపాడేందుకు తమ సిబ్బంది శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఆ శాఖ కమిషనర్ హరి జవహర్లాల్ తెలిపారు(Endowment commissioner Hari Jawaharlal on devotes). దేవాలయ సిబ్బందికి ఆహార్యం, భాష, ప్రవర్తనా నియమావళి మార్పు రావాలన్నారు. భక్తుల పట్ల మర్యాదగా సౌమ్యంగా మెలగాలని సూచించారు. చాలా మంది భక్తులు దేవాలయాలకు ఇచ్చిన ఆస్తులు, ఆభరణాల రక్షణ బాధ్యత దేవాదాయశాఖదేనన్నారు. అర్చకుల సమస్యలను త్వరలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హరిజవహర్ లాల్ చెప్పారు.