ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NOTICE: ధూళిపాళ్ల మెమోరియల్ ట్రస్ట్​కు మళ్లీ నోటీసులు.. - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

NOTICE: ధూళిపాళ్ల వీరయ్యచౌదరి మెమోరియల్ ట్రస్టుకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ట్రస్టు ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో సమాధానం చెప్పాలంటూ దేవాదాయ శాఖ నోటీసులిచ్చింది.

NOTICE
ధూళ్లిపాళ్ల మెమోరియల్ ట్రస్ట్​కు మరోమారు నోటీసులు

By

Published : Jun 25, 2022, 10:39 AM IST

NOTICE: ధూళిపాళ్ల వీరయ్యచౌదరి మెమోరియల్ ట్రస్టుకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ట్రస్టు ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో సమాధానం చెప్పాలంటూ దేవదాయ శాఖ నోటీసులిచ్చింది. ట్రస్టు వ్యవహారంపై ఇప్పటికే న్యాయస్థానంలో కేసు కొనసాగుతోంది. ఎలాంటి తదుపరి చర్యలూ వద్దంటూ కోర్టు గతంలో ప్రభుత్వానికి స్పష్టం చేసింది. న్యాయస్థానంలో ఈనెల 29న కేసు విచారణకు రావాల్సి ఉంది. ఈలోగా మరోసారి సెక్షన్ 43 కింద దేవదాయశాఖ నోటీసులు జారీచేసింది. ప్రభుత్వం నోటీసులు ఇవ్వడమంటే.. న్యాయ ఉల్లంఘనే అని తెలుగుదేశం వర్గాలు ఆరోపించాయి. ఇది కక్షసాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేతలు మండిపడుతున్నారు. మే 30వ తేదీ తారీఖుతో రూపొందించిన ఈ నోటీసులు ట్రస్టుకు ఆలస్యంగా అందాయి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details