విజయవాడ దుర్గగుడిలో నకిలీ ధ్రువీకరణ పత్రాల దందా(FAKE CERTIFICATES) మరోసారి తెరపైకి వచ్చింది. చాలా ఏళ్లుగా అనేక విమర్శలు వస్తున్నా.. గతంలోని అధికారులెవరూ పట్టించుకోలేదు. తాజాగా ఇద్దరు ఉద్యోగులకు సంబంధించిన ధ్రువీకరణపత్రాలు నకిలీవని గుర్తించిన ఈవో భ్రమరాంబ విచారణ చేయగా.. వారు కూడా అంగీకరించారు. వారిద్దరినీ సస్పెండ్ చేశారు. దేవస్థానాన్ని మోసం చేయడం, అక్రమ పద్ధతుల్లో పదోన్నతి పొంది జీతభత్యాలు తీసుకున్నందుకు విజయవాడ వన్‌టౌన్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
2019లోనే వెలుగులోకి..
ఇంద్రకీలాద్రిపై నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందిన విషయంపై 2019 లోనే విజిలెన్స్ అధికారులు దృష్టిపెట్టారు. పక్కాగా ఆధారాలు దొరికిన ఒకరిద్దరు సిబ్బందిని విచారించగా.. వాళ్లు తప్పించుకునేందుకు మరికొందరి పేర్లు చెప్పినట్టు తెలిసింది. సమగ్ర విచారణ కోసం మరికొందరి వివరాలు కావాలని విజిలెన్స్ అధికారులు దేవస్థానాన్ని కోరారు. విచారణ సుదీర్ఘంగా మారి..పక్కదారి పట్టింది. తాజాగా మరోసారి విజిలెన్స్ అధికారులు దృష్టిపెట్టడడంతో నకిలీల డొంక కదిలింది. ప్రస్తుతం ఉన్న ఈవో భ్రమరాంబ దీనిపై అంతర్గత విచారణ చేపట్టడంతో ఇద్దరు ఉద్యోగులు దొరికారు.
ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల నుంచి..