ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

JOBS NOTIFICATION: పోలీసు ఉద్యోగాల భ‌ర్తీ కోసం.. నిరుద్యోగుల‌ ఎదురుచూపులు - waiting for the police jobs notifications

పోలీసు ఉద్యోగాల భ‌ర్తీ కోసం(waiting for the police job notifications) ఎదురుచూస్తున్న నిరుద్యోగుల‌కు నిరీక్షణ త‌ప్పట్లేదు. ఆ శాఖ‌లో వేల‌ల్లో ఖాళీలు ఉన్నప్పటికీ... ఈ ఏడాది 450పోస్టుల‌ే భ‌ర్తీచేస్తామ‌ని..సెప్టెంబ‌రులో నోటిఫికేషన్‌ విడుద‌ల చేస్తామ‌ని జాబ్ క్యాలండ‌ర్‌లో ప్రక‌టించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మాట నిల‌బెట్టుకోలేక‌పోయింది. అక్టోబ‌ర్ రెండో వారంలోకి వ‌చ్చినా స‌రే ఇప్పటికీ ఉద్యోగ ప్రక‌ట‌న రాలేదు. అనేక వ్యయప్రయాస‌ల‌కోర్చి ఉద్యోగాల‌కు స‌న్నద్ధమ‌వుతున్నామ‌ని.. నోటిఫికేష‌న్(police job notifications) జారీ జాప్యమ‌య్యేకొద్దీ త‌మ‌పై భారం మ‌రింత అధిక‌మ‌వుతోంద‌ని..నిరుద్యోగులు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు.

Employees waiting for the police jobs notification in the state
పోలీసు ఉద్యోగాల భ‌ర్తీ కోసం నిరుద్యోగుల‌ ఎదురుచూపులు

By

Published : Oct 12, 2021, 4:45 AM IST

రాష్ట్రంలో 10,143 ప్రభుత్వోద్యోగాల భ‌ర్తీకి ఈ ఏడాది జూన్‌లో ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ జాబ్ క్యాలండ‌ర్‌(cm jagan on job calendar) విడుద‌ల చేశారు. పోలీసుశాఖ‌లో 450ఉద్యోగాల భ‌ర్తీకి సెప్టెంబ‌రులో నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని అందులో వెల్లడించారు. అయితే ఇప్పటివ‌ర‌కూ నోటిఫికేష‌న్ ఇవ్వక‌పోవ‌టంపై.. విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో 2018 న‌వంబ‌రు, డిసెంబ‌రు నెల‌ల్లో పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు(waiting for the police job notifications)విడుద‌ల‌ అయ్యాయి. అప్పట్లో 334ఎస్సై స్థాయి పోస్టులు, 2,723కానిస్టేబుల్ స్థాయి పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చారు. దాదాపు 5ల‌క్షల మంది అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. 2018 తర్వాత మరో నోటిఫికేష‌న్ లేక‌పోవ‌టం వల్ల ఇప్పుడు అదే స్థాయిలో ఆశావహులు ఎదురు చూస్తున్నారు.

తొలుత ఏటా 6,500పోలీసు ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని(cm jagan commensts on jobs) ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ ప్రక‌టించారు. అయితే ఈ ఏడాది 450పోస్టుల‌ే భ‌ర్తీ చేస్తామ‌ని ప్రభుత్వం(ap job calendar) జాబ్ క్యాలండ‌ర్‌లో ప్రస్తావించింది. దీనిపై అప్పట్లో నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. వ‌చ్చే జాబ్ క్యాలండ‌ర్ నుంచి ఏటా 6500చొప్పున భ‌ర్తీ చేస్తామంటూ జులైలో డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ ప్రక‌టించారు. అయితే క‌నీసం ఈ ఏడాది భ‌ర్తీ చేస్తామ‌ని చెప్పిన పోస్టుల‌కైనా.... ప్రక‌టించిన గ‌డువులోగా నోటిఫికేష‌న్ ఇవ్వక‌పోటంపై విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details