ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి.. నగదు మాయం..! - employees PF accounts money debited

ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బుల డెబిట్ అయ్యాయని ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ అన్నారు. తమ నగదు ఎవరు తీసుకున్నారో తెలియడం లేదన్నారు. గతంలోనూ ఇలాగే జరిగితే ఫిర్యాదు చేస్తే మళ్లీ తిరిగి వేశారని గుర్తు చేశారు. ప్రస్తుత ఘటనపై ఫిర్యాదు చేయటానికి వెళ్తే ఆర్థికశాఖ అధికారులు లేరన్నారు. విత్‌డ్రా ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

నగదు
నగదు

By

Published : Jun 28, 2022, 7:51 PM IST

ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు డెబిట్ అయినట్లు.... ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ తెలిపారు. గత రాత్రి ఉద్యోగుల ఖాతాల నుంచి విత్ డ్రా చేసుకున్నట్టు సందేశాలు వచ్చాయన్నారు. తన వ్యక్తిగత ఖాతా నుంచి 83 వేల రూపాయలు విత్ డ్రా చేసేశారన్నారు. గతంలోనూ ఇదే తరహాలో జరిగితే ఫిర్యాదు చేస్తే మళ్లీ తిరిగి వేశారని గుర్తు చేశారు. మొత్తం 90 వేల మంది ఉద్యోగులకు చెందిన పీఎఫ్ ఖాతాల నుంచి రూ.800 కోట్ల వరకు వెనక్కు తీసుకున్నారని తెలిపారు. ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అధికారులు అందుబాటులో లేరన్నారు. ఉద్యోగుల సమ్మతి లేకుండా వారి ఖాతాల నుంచి సొమ్ము విత్ డ్రా చేయడం నేరమని పేర్కొన్నారు.

ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి.. నగదు మాయం..!

90 వేల మంది జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ.800 కోట్లు తీసుకున్నారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఆర్థికశాఖ అధికారులు లేరు.ప్రభుత్వానికి తెలిసే జరిగాయా.. లేక అధికారుల తప్పిదమా తెలియదు. ఏది ఏమైనా మా సమ్మతి లేకుండా మా ఖాతాల నుంచి విత్‌డ్రా చేయడం నేరం.విత్‌డ్రా ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తాం.మార్చిలో జరిగిన లావాదేవీలను మాకు చెప్పకపోవడమూ తప్పిదమే. మా ఖాతాల నుంచి విత్‌డ్రా చేసే సాంకేతికత ఉండటం చట్టబద్ధమా? -సూర్యనారాయణ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details