ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ ఉద్యోగులెవరికీ సంతృప్తిగా లేదని వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఏపీ వాణిజ్య పన్నుల శాఖ అసోసియేషన్ స్వర్ణోత్సవ సభలో పాల్గొన్న ఆయన..పీఆర్సీ అంశంపై ప్రభుత్వంతో చర్చించి నయానో భయానో డిమాండ్లు సాధించుకున్నామని తెలిపారు. ప్రభుత్వ ఇబ్బందులను గుర్తించి ఉద్యోగులు సర్దుకు పోయారని అన్నారు. ఉద్యోగులు ఆశించినంత లేకపోయినా ఓ గౌరవప్రదమైన పీఆర్సీ వచ్చిందని సర్దుకు పోయామని వ్యాఖ్యానించారు. పీఆర్సీ జీవోలు వచ్చిన అనంతరం ఏ ఉద్యోగ సంఘాలు సీఎం జగన్కు సన్మానం చేయకపోయినా.. వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ స్వర్ణోత్స సభలో ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నామన్నారు.
పీఆర్సీ సంతృప్తిగా లేకపోయినా.. సర్దుకు పోయాం: సూర్యనారాయణ - సూర్యనారాయణ తాజా వార్తలు
ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ ఉద్యోగులెవరికీ సంతృప్తినివ్వకపోయినా.. ప్రభుత్వ ఇబ్బందులను గుర్తించి సర్దుకుపోయామని ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ అన్నారు. ఉద్యోగులు ఆశించినంత లేకపోయినా ఓ గౌరవప్రదమైన పీఆర్సీ సాధించామని అన్నారు.
పీఆర్సీ సంతృప్తిగా లేకపోయినా.. సర్దుకు పోయాం
Last Updated : Apr 6, 2022, 6:23 PM IST