ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉద్యోగులను మోసం చేస్తున్న ప్రభుత్వం.. ఏపీసీపీఎస్‌ఈఏ అధ్యక్షుడు అప్పలరాజు ధ్వజం - వైకాపాపై ఏపీసీపీఎస్‌ఈఏ అధ్యక్షుడు అప్పలరాజు ఫైర్

Employees fires on govt: సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. జీపీఎస్‌ పేరుతో ఉద్యోగులను మోసం చేస్తోందని ఏపీసీపీఎస్‌ఈఏ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీపీఎస్‌ అనేది సీపీఎస్‌ ఉద్యోగులను పూర్తిగా అగాధంలోకి నెట్టేసే దుర్మార్గపు పథకమని వారు అన్నారు.

employees fires on YSRCP government
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగుల మండిపాటు

By

Published : May 30, 2022, 9:13 AM IST

Employees fires on govt: సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. జీపీఎస్‌ పేరుతో ఉద్యోగులను మోసం చేస్తోందని ఏపీసీపీఎస్‌ఈఏ (ఆంధ్రప్రదేశ్‌ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.అప్పలరాజు, కార్యదర్శి కె.పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ అరండల్‌పేటలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. జీపీఎస్‌ అనేది సీపీఎస్‌ ఉద్యోగులను పూర్తిగా అగాధంలోకి నెట్టేసే దుర్మార్గపు పథకమని చెప్పారు.

పాత పెన్షన్‌ ఇస్తే బడ్జెట్‌ సరిపోదని ప్రభుత్వం చెప్పిందని.. 20 ఏళ్ల తర్వాత పదవీ విరమణ పొందిన వారికి బడ్జెట్‌ ఎందుకు సరిపోదని ప్రశ్నించే సరికి.. కొత్త పల్లవి అందుకుందని విమర్శించారు. జులై 24న శ్రీకాకుళంలో ‘నయవంచనపై ధర్మ పోరాటం’ పేరుతో నిర్వహించనున్న నిరసన ర్యాలీ, సభ ప్రచార పత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కె.శైలజ, కార్యదర్శి మొహమ్మద్‌ హుస్సేన్‌, కరిమి రాజేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, పలు జిల్లాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details