ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Employees on Fitment: ఫిట్‌మెంట్‌పై సీఎం దగ్గరే తేల్చుకుంటాం: ఉద్యోగ సంఘాల నాయకులు - ap news

Govt Employees on Fitment: తమకు ఇచ్చే బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వం దొంగ లెక్కలు చెప్పే ప్రయత్నం చేస్తోందని ఉద్యోగ సంఘాల జేఏసి నేతలు ఆరోపించారు. ప్రభుత్వం తమపై వేలకోట్ల ఖర్చు చేస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విజయవాడ ధర్నా చౌక్​లో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

employee jac protest at dharna chowk at vijayawada
employee jac protest at dharna chowk at vijayawada

By

Published : Dec 16, 2021, 1:56 PM IST

Updated : Dec 16, 2021, 2:29 PM IST

Govt Employees on Fitment:విజయవాడ ధర్నాచౌక్‌లో ఉద్యోగ సంఘాల జేఏసీ ధర్నా చేపట్టింది. అధికారుల కమిటీ ఇచ్చిన పీఆర్సీ నివేదికను ఆమోదించబోమని, ఇది ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ రోజు ధర్నాలు కొనసాగుతున్నాయని ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు.

పీఆర్సీ నివేదిక పాక్షికంగా ఇచ్చారని.. మిగిలిన నివేదికలు కూడా ఇవ్వాలని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్​ చేశారు. 11 వ పీఆర్సీ కమిషన్ నివేదికను పట్టించుకోలేదన్నారు. అధికారుల కమిటీ వేసి నచ్చినట్టు నివేదిక ఇచ్చారని ఆరోపించారు. 14.39 శాతం ఫిట్‌మెంట్‌ కుదరదని చెప్పామని.. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ హెచ్ఆర్ఏ, డీఏ ఇవ్వాలని బొప్పరాజు డిమాండ్​ చేశారు.

'అధికారుల నివేదిక మాకు ఆమోదం కాదు. ఫిట్‌మెంట్‌పై సీఎం దగ్గరే తేల్చుకుంటాం. అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ప్రభుత్వం దొంగలెక్కలు చెప్పే ప్రయత్నం చేస్తోంది.'- ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు

'మేము 50 శాతం ఫిట్‌మెంట్‌ అడుగుతున్నాం. కనీస వేతనం రూ.23 వేలు ఉండాలి. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల మూలవేతనం పెంచాలి. గ్రాట్యుటీ రూ.23 లక్షలకు పెంచాలి. ప్రభుత్వం స్పందిస్తేనే కార్యాచరణపై చర్చిస్తాం.' - ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు

ఉద్యోగ సంఘాల నేతలు

ఇదీ చదవండి:

Govt Employees on Fitment: ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత: సజ్జల

Last Updated : Dec 16, 2021, 2:29 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details