రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ కరోనా టీకాలు వేసేంత వరకు పంచాయతీ ఎన్నికల నిర్వహణ వాయిదా వేయించాలంటూ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల బృందం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను వినతిపత్రం అందజేసింది. రెవెన్యూ, అమరావతి ఉద్యోగ ఐకాస, పోలీసు, ఉపాధ్యాయ సంఘాల నేతలు సంయుక్తంగా 7 పేజీల వినతిపత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. ప్రస్తుతం టీకాల ప్రక్రియ మొదలైందని..రెండు డోస్‌లు పూర్తయ్యే వరకు ఎన్నికలు నిలిపివేయించాల్సిందిగా నేతలు విజ్ఞప్తి చేశారు.
'కరోనా టీకాలు వేసే వరకు ఎన్నికలు వాయిదా వేయించండి' - ఏపీ గవర్నర్‌తో ఉద్యోగ సంఘాల నేతల భేటీ
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వాయిదా వేయించాలని కోరుతూ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల బృందం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ కరోనా టీకాలు వేసే వరకు ఎన్నికల ప్రక్రియను నిలిపివేయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
కరోనా టీకాలు వేసే వరకు ఎన్నికలు వాయిదా వేయించండి