పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలో ప్రజలు అస్వస్థతకు గురికావటంపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆందోళన చెందారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.
ఐదు రోజుల నుండి కలుషిత నీరు వస్తుందని ప్రజలు చెప్పినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. తక్షణమే సురక్షిత మంచినీటిని సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు.