Q:ఎలాంటి లక్షణాలతో బాధితులు ఆసుపత్రికి వస్తున్నారు.?
జ:కళ్లు తిరగడం, మూర్ఛ లక్షణాలు బాధితులందరిలో కనిపించాయి. అందరూ చికిత్సకు స్పందిస్తున్నారు. అస్వస్థతకు కారణమేంటో గుర్తించి వాటి మూలాలను ధ్వంసం చేయాలి. అప్పుడే ఇకపై కేసులు రావు. ఇప్పటికే.. కొన్ని నమూనాలు సేకరించాం. రక్తం, నీరు, మూత్ర నమూనాలను దిల్లీ ఎయిమ్స్‌కు పంపించాం.
ఎంతమంది నమూనాలను సేకరించారు.
జ: 5 రకాల నమునాలను కొత్తగా చేరిన బాధితుల నుంచి సేకరించాం. కారణం కనుక్కునేందుకు కృషి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా...... నమూనాలను హైదరాబాద్‌కు పంపింది. ఈ వ్యాధిని అడ్డుకోవడమే మా అందరి ప్రయత్నం.
Q:ఏ కారణంతో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు.?
జ: పరీక్షించిన నమునాల ఫలితాలు రానంత వరకూ....... కచ్చితంగా అంచనా వేయలేం. నీళ్లూ కారణం కావచ్చు. కలుషిత నీళ్ల వల్ల అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంది. నమూనాల ఫలితాలు వస్తే..నీళ్ల వల్లనా.. లేక వైరల్ ఇన్ఫెక్షన్ కారణమా తేలుతుంది.
Q: ఏవైనా లోహాలు కారణం అయ్యి ఉండవచ్చంటారా?