ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఏలూరు ఘటన అధికారుల అలసత్వానికి పరాకాష్ట'

అధికారుల అలసత్వం వల్లే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. వెంటనే సంబధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Bonda Uma
Bonda Uma

By

Published : Dec 6, 2020, 4:40 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు అస్వస్థతకు గురవటం పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వానికి పరాకాష్ట అని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్, రాజరాజేశ్వరి పేటలో అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా పేదలకు తెదేపా ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బొండా ఉమ పాల్గొన్నారు.

సాక్షాత్తు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నియోజకవర్గంలోనే అంతు చిక్కని వ్యాధితో 300 మంది అనారోగ్యానికి గురవటం దారుణమని ఉమ అన్నారు. ఏలూరులో పారిశుద్ధ్యం నిర్వహణంగా అధ్వానంగా ఉందని అధికారులకి ప్రజలు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. వెంటనే సంబధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details