ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Electricity Employees JAC: అక్రమ కేసులు ఎత్తేసి.. సమస్యలు పరిష్కరించాలి: విద్యుత్ ఉద్యోగుల ఐకాస

Electricity Employees JAC: సమస్యలు పరిష్కరించాలని కోరితే ప్రభుత్వం తమపై కేసులు నమోదు చేసి భయబ్రాంతులకు గురి చేస్తోందని రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐకాస నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఉద్యోగులపై నమోదు చేసిన కేసులను ఎత్తేసి...సమస్యలు పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు.

అక్రమ కేసులు ఎత్తేసి..సమస్యలు పరిష్కరించాలి
అక్రమ కేసులు ఎత్తేసి..సమస్యలు పరిష్కరించాలి

By

Published : Dec 19, 2021, 10:11 PM IST

Electricity Employees JAC: సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరినందుకు కేసులు, విచారణల పేరుతో తమను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐకాస నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం 31 సంఘాలతో ఏర్పడిన ఐకాసను అభద్రతా భావానికి గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

విజయవాడలో నిర్వహించిన ఐకాస సమావేశంలో తాజా పరిణామాలపై నేతలు చర్చించారు. ఉద్యోగులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని.., కొత్త సేవా నిబంధనలను డిస్కమ్‌లో రూపొందించడాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల తొలగింపు చర్యలు విడనాడి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లోని డీఏలను తక్షణమే విడుదల చేస్తామని విద్యుత్​శాఖ మంత్రి ఈ ఏడాది జూన్‌ 14న ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు.

ఏపీపీడీసీఎల్ (APPDCL), ఏపీ జెన్​కో ఎస్​డీఎస్​టీపీఎస్ (SDSTPS) ప్రాజెక్టు ప్రైవేటీకరణ, సేల్‌ అవుట్‌తోపాటు హైడల్‌ ప్రాజెక్టులను అప్పగించటాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యుత్తు సరవణ బిల్లు 2021కి వ్యతిరేకంగా రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్తు రంగ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు.

ఇదీ చదవండి :

Drunken Driving : ఇంట్లో నీ కోసం ఎదురు చూస్తున్నారు బ్రో.. వాళ్లను అనాథలు చేయకు

ABOUT THE AUTHOR

...view details