ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలో ఎలక్ట్రికల్ ఆటో షోరూం ప్రారంభం - విజయవాడలో ఏప్ ఇ-సిటీ పేరుతో ఆటో షోరూం ప్రారంభం

అత్యాధునిక లిథియం అయాన్ బ్యాటరీలతో నడిచే ఆటోల షోరూంను విజయవాడలో ప్రారంభించారు. ఈ ఆటోలను మెుట్టమెుదటి సారిగా పియాజియో ద్వారా మార్కెట్​లోకి తీసుకువచ్చారు.

Electric Auto Inauguration in vijayawada
విజయవాడలో ఎలక్ట్రికల్ ఆటో షోరూం ప్రారంభం

By

Published : Feb 21, 2020, 1:35 PM IST

విజయవాడలో ఎలక్ట్రికల్ ఆటో షోరూం ప్రారంభం

విజయవాడలో 'ఏప్ ఇ-సిటీ' పేరుతో అత్యాధునిక లిథియం అయాన్ స్మార్ట్ బాటరీలతో నడిచే ఆటో షోరూమ్​ను పియాజియో మేనేజర్ సాజు నాయర్ ప్రారంభించారు. పర్యావరణహితమైన ఈ ఆటోలకు ఎటువంటి పర్మిట్, రహదారి పన్నులు అవసరం లేదని రీజినల్ మేనేజర్ శ్రీకాంత్ అన్నారు. ఈ వాహనాలు ఛార్జింగ్ కోసం సులభంగా బ్యాటరీలను మార్చుకునేలా ఛార్జింగ్ పాయింట్స్ నెలకొల్పుతున్నామన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ఆటోలు దేశంలో మొట్టమొదటిసారిగా పియాజియో ద్వారా విపణిలోకి తెచ్చామన్నారు. వీటి నిర్వహణకు ఎటువంటి ఖర్చు అవసరం లేదని... మొదటి మూడు సంవత్సరాల వరకు సంస్థ ఉచిత నిర్వహణ అందిస్తుందన్నారు.

For All Latest Updates

TAGGED:

ape e-city

ABOUT THE AUTHOR

...view details