ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NOTIFICATION : రాష్ట్రంలో మిగిలిన కార్పొరేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ - election notification release

రాష్ట్రంలో మిగిలిపోయిన కార్పొరేషన్‌(corporation), స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల అయింది(notification release). ఎన్నికల కోసం నవంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్​లో పేర్కొన్నారు.

రాష్ట్రంలో మిగిలిన కార్పొరేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌
రాష్ట్రంలో మిగిలిన కార్పొరేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌

By

Published : Nov 1, 2021, 1:18 PM IST

Updated : Nov 1, 2021, 2:46 PM IST

వివిధ కారణాలతో రాష్ట్రంలో ఎన్నికలు జరగని కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ (election notification) విడుదల అయింది. నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌, 12 మున్సిపాల్టీలు, 498 పంచాయతీల్లోని 69 సర్పంచ్, 533 వార్డు పదవులు, 187 ఎంపీటీసీ స్థానాలు, 14 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనందున నేటినుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని ఎస్ఈసీ నీలం సాహ్ని ఉత్తర్వుల్లో వెల్లడించారు.

ఈ నెల 14, 15, 16 తేదీల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. 14న పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈనెల 15న మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనుండగా.. 17న మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఈ నెల 16న ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు, 18న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎస్ఈసీ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రేటర్‌ విశాఖలో రెండు డివిజన్‌ స్థానాలు, 6 మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలోని 10 డివిజన్లు, 12 మున్సిపాల్టీల్లోని 13 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి.

నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీల్లో నవంబర్ 15 న ఎన్నికలు జరగనున్నాయి.

గ్రామ పంచాయతీలు

  • ఈ నెల 3న నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ
  • ఈ నెల 5 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ
  • ఈ నెల 9న నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ
  • ఈ నెల 14న ఎన్నికలు, లెక్కింపు

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు

  • ఈ నెల 3న నోటిఫికేషన్‌, నామినేషన్ల స్వీకరణ
  • ఈనెల 5న నామినేషన్ల స్వీకరణకు చివరితేదీ
  • ఈ నెల 8న నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ
  • ఈ నెల 15న ఎన్నికలు, 17న లెక్కింపు

పరిషత్‌ ఎన్నికలు

  • ఈ నెల 3న నోటిఫికేషన్‌, నామినేషన్ల స్వీకరణ
  • ఈ నెల 5న నామినేషన్ల స్వీకరణకు చివరితేదీ
  • ఈ నెల 9న నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ
  • ఈ నెల 16న ఎన్నికలు, 18న ఓట్ల లెక్కింపు

కుప్పంలో తొలిసారి..

కుప్పం మున్సిపాలిటీకి తొలిసారిగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులు, 39,261 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

  • ఈనెల 3 నుంచి 5 వరకు నామినేషన్ల స్వీకరణ
  • ఈనెల 6న నామినేషన్ల పరిశీలన
  • ఈనెల 8న ఉపసంహరణ, అభ్యర్థుల ప్రకటన
  • ఈనెల 15 న పోలింగ్, 17న ఓట్ల లెక్కింపు

ఇదీచదవండి.

Last Updated : Nov 1, 2021, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details