నామినేషన్లను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా సదుం మండలంలో జరిగిన ఘటనను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించి.. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకోమని కమిషనర్ హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇబ్బంది కలిగించినా తీవ్రంగా పరిగణిస్తామన్నారు.
నామినేషన్లను అడ్డుకునే వారిపై కఠినచర్యలు - andhra local body elections news
నామినేషన్లను అడ్డుకునే చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులకు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టించవద్దని హితవు పలికారు.

election commsioner ramesh kumar about nominations