సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి విజయానంద్ నేతృత్వంలో రాజకీయ పార్టీలు సమావేశమయ్యాయి. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీన విడుదల చేసే తుది ఓటర్ల జాబితా కోసం అభ్యంతరాలను తెలియజేయాల్సిందిగా వారికి ముసాయిదా జాబితాను అందించింది. దీంతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలతో ఎన్నికల ప్రధానాధికారి చర్చలు జరిపారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో 49 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన మార్పుపై తెలుగుదేశం పార్టీ సీఈఓ దృష్టికి తీసుకు వచ్చింది. దీన్ని సవరించాల్సిందిగా సూచించింది. మరోవైపు 1500 మంది ఓటర్లకు ఓ పోలింగ్ కేంద్రం ఉండేలా ఏర్పాటు చేయాల్సిందిగా వైకాపా విజ్ఞప్తి చేసింది. గిరిజన ప్రాంతాల్లో ప్రతి 2 కిలోమీటర్ల పరిధిలో ఓ పోలింగ్ కేంద్రం ఉండేలా చూడాలని కోరింది.