అక్టోబర్ నెలాఖరు వరకు ప్రీరివిజన్ కార్యక్రమాలు చేపడతారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, డూప్లికేట్ ఓట్ల తొలగింపు, పోలింగ్ కేంద్రాల సర్దుబాటు, మార్పులు, చేర్పులు ఇందులో ఉంటాయి. నవంబర్ 16వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేస్తారు.
ఆరోజు నుంచి డిసెంబర్ 12 వరకు అభ్యంతరాలు, వినతుల స్వీకరణకు గడువు ఉంటుంది. ఇందుకోసం పోలింగ్ బూత్ల వద్ద.. అధికారులు, సిబ్బంది అందరికీ అందుబాటులో ఉండేలా నెలలో రెండు శని, ఆదివారాలు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతారు.