విజయవాడలో నగరపాలక సంస్థ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు పొత్తులతో తలపడుతుండగా....వైకాపాతోపాటు, సీపీఎం, కాంగ్రెస్ ఒంటరిగానే తలపడుతున్నాయి. తెలుగుదేశం, సీపీఐ పక్షాలు అనూహ్యంగా పొత్తు కుదుర్చుకున్నాయి. భారతీయ జనతా పార్టీ, జనసేన పొత్తుకుదుర్చుకుని బరిలో దిగాయి. తెలుగుదేశం పార్టీ 57 డివిజన్లలో పోటీకి దిగుతుండగా, సీపీఐ 6 డివిజన్లలో పోటీ చేస్తోంది. 15వ డివిజన్‌లో స్థానిక పరిస్థితుల దృష్ట్యా జనసేనకి తెదేపా మద్దతు తెలిపి పోటీలో నిలబడలేదు. ఇలా 3 పార్టీలు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను కలిసి పోటీ చేస్తున్నాయి.
ఇక భాజపా 22 డివిజన్లలో పోటీ చేస్తుండగా... జనసేన 40స్థానాల్లో పోటీకి దిగింది. సీపీఎం పక్షం అయితే ఈసారి తనకు బలం ఉన్న డివిజన్లకు ఎంచుకుని 22 డివిజన్లలో ఒంటరిగా పోటీకి దిగుతోంది. కాంగ్రెస్ 40 డివిజన్లలో పోటీకి దిగింది.