ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఐక్యతతోనే అభివృద్ధి.. సర్దార్ జీవితమే స్ఫూర్తి: డీజీపీ - కలెక్టర్ ఇంతియాజ్

ప్రజల్లో ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమని డీజీపీ సవాంగ్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా విజయవాడలో నిర్వహించిన ఏక్తా ర్యాలీకి హాజరయ్యారు.

Ekta rally in vijayawada

By

Published : Oct 31, 2019, 9:52 AM IST

విజయవాడలో ఏక్తా ర్యాలీ

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా.. విజయవాడలో ఏక్తా దినోత్సవ్ ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోదీ పిలుపుమేరకు చేసిన ప్రదర్శనలో డీజీపీ గౌతం సవాంగ్, కలెక్టర్ ఇంతియాజ్, సీపీ ద్వారక తిరుమలరావు, పలువురు పోలీసులు పాల్గొన్నారు. శాంతికి సూచికగా పావురాలు, బెలూన్లను గాల్లోకి వదిలారు. అందరితో ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు. బెంజ్ సర్కిల్ నుంచి ఏఆర్ గ్రౌండ్ వరకు ర్యాలీ చేశారు. ప్రజలంతా ఐక్యంగా ఉంటేనే దేశ అభివృద్ధి సాధ్యమని డీజీపీ అన్నారు. పోలీసు శాఖలోని అన్ని విభాగాల సిబ్బంది కలిసి పనిచేయాలని చెప్పారు. ర్యాలీలో నగరవాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details