కరోనా కేసుల్లో తగ్గుదల... కొత్తగా 8,110మందికి పాజిటివ్ - anadhrapradhesh corona deaths
16:25 June 10
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. 24 గంటల వ్యవధిలో 97,863 మందికి పరీక్షలు చేయగా... 8,110 మందికి వైరస్ సోకింది. మహమ్మారికి మరో 67 మంది బలయారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 11మంది చనిపోయారు. పశ్చిమగోదావరి జిల్లాలో 9, విశాఖలో ఏడుగురు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం , విజయనగరం జిల్లాల్లో ఆరుగురు చొప్పున మరణించారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,416 కేసులు బయటపడగా... చిత్తూరు జిల్లాలో 1,042, అనంతపురం జిల్లాలో 906, పశ్చిమగోదావరి జిల్లాలో 792 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా నుంచి 12,981 మంది కోలుకోగా... ప్రస్తుతం 99,057 యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీచదవండి.