ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎఫ్​ ట్రానిక్స్​ ఐటీ సంస్ధకు సీఎంఎంఐ లెవెల్​ - 3 గుర్తింపు - cmmi certificate to efftronixs

విజయవాడకు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ 'ఎఫ్ ట్రానిక్స్' అరుదైన గుర్తింపు సాధించింది. అత్యంత మెరుగైన పనితీరు కనబరిచినందుకు ఈ ఏడాది సీఎం​ఎంఐ ఇనిస్టిట్యూట్ లెవెల్ - 3 సర్టిఫికెట్​ను అందుకున్నారు.

ఎఫ్​ ట్రానిక్స్​ ఐటీ సంస్ధకు సీఎంఎంఐ లెవెల్​ - 3 గుర్తింపు
ఎఫ్​ ట్రానిక్స్​ ఐటీ సంస్ధకు సీఎంఎంఐ లెవెల్​ - 3 గుర్తింపు

By

Published : Feb 13, 2020, 7:02 PM IST

ఎఫ్ ట్రానిక్స్ సంస్థకు సీఎంఎంఐ లెవెల్​ - 3 ధ్రువపత్రం

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత నాణ్యమైన సాఫ్ట్​వేర్, ఐటీ ఉత్పత్తులను తయారు చేసే సంస్థలకు అమెరికాలోని సీఎం​ఎంఐ ఇని​స్టిట్యూట్ ధ్రువపత్రాలను ఇస్తుంది. ప్రస్తుతం మన దేశంలో 9 ఐటీ సంస్థలు మాత్రమే సీఎం​ఎంఐ లెవెల్ - 3 సర్టిఫికెట్​ కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో విజయవాడకి చెందిన ఎఫ్ ట్రానిక్స్ సంస్థ చేరింది. 30 ఏళ్లుగా ట్రాఫిక్ విభాగంలో వాడే ఎల్​ఈడీ లైట్లు, డిస్​ప్లే బోర్డులు, వాటి సాఫ్ట్​వేర్లపై పరిశోధనలు చేస్తూ వాటిని తయారు చేసి ఈ సంస్ధ సేవలందిస్తోంది. దేశవ్యాప్తంగా రైల్వే లైన్ సిగ్నలింగ్ వ్యవస్థను ఎంతో కాలంగా ఎఫ్ ట్రానిక్స్ నిర్వహిస్తోంది. వీటితో పాటు స్మార్ట్ బిల్డింగ్స్, స్మార్ట్ సిటీల్లో సాంకేతికతను వినియోగించి పలు ప్రాజెక్టులు చేపడుతోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత సేవలు సైతం అందిస్తోంది. అరుదైన గుర్తింపు సాధించడం పట్ల సంస్థ సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రాష్ట్రానికి, దేశానికి మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చేలా కృషి చేస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details