ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Invitation Letter to CJI : విద్యార్థులారా... లేఖ రాసి సీజేఐకి స్వాగతం పలకండి.. - సీజేఐకు స్వాగత లేఖ పంపేందుకు ఈనాడు వాట్సప్ నెంబర్

Invitation Letter to CJI : రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పర్యటించనున్నారు. ఓ తెలుగు వ్యక్తి అంత ఉన్నత శిఖరాలను అధిరోహించడం మన తెలుగువారందరికీ గర్వకారణం. జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు విద్యార్థులు అంటే చాలా ఇష్టం. అందుకే పిల్లలూ.. లేఖ రాసి సీజేఐకి స్వాగతం పలకండి. ‘ఈనాడు’ మీకు ఈ అవకాశం కల్పిస్తోంది.

Invitation Letter to CJI
పిల్లలూ...లేఖ రాసి సీజేఐకి స్వాగతం పలకండి

By

Published : Dec 23, 2021, 3:21 PM IST

Invitation Letter to CJI : రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పర్యటించనున్నారు. ఓ తెలుగు వ్యక్తి అంత ఉన్నత శిఖరాలను అధిరోహించడం మన తెలుగువారందరికీ గర్వకారణం. జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు విద్యార్థులు అంటే చాలా ఇష్టం. తెలుగు రాష్ట్రాల నుంచి అనేకమంది చిన్నారులు తరచూ ఆయనకు లేఖలు రాసి వారి సమస్యలను ప్రస్తావిస్తుంటారు. ఆయన వారందరికీ ప్రత్యుత్తరాలు ఇస్తుంటారు. ప్రస్తుతం ఆయన మన రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు విచ్చేస్తున్నారు. డిసెంబర్‌ 24 నుంచి 26 వరకు ఇక్కడే ఉండబోతున్నారు.

ఆయన దృష్టికి మీ సమస్యలను తీసుకెళ్లేందుకు ఇదో చక్కని అవకాశం. పాఠశాల విద్యార్థులు ఎవరైనా ఆయనకు లేఖలు రాసే అవకాశం ‘ఈనాడు’ మీకు కల్పిస్తోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాకను స్వాగతిస్తూ మీరు విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో ఎదుర్కొంటున్న ఏవైనా సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావొచ్చు. లేఖలు పంపించే విద్యార్థులు మీ పేరు, ఫొటోను తప్పనిసరిగా పంపించండి. వీలైతే మీరు ఎదుర్కొంటున్న సమస్యకు సంబంధించిన ఒక ఫొటోను కూడా తీసి వాట్సాప్‌ చేయండి. ఆలోచింపజేసే బాగున్న లేఖలను ప్రచురిస్తాం.

లేఖలు పంపాల్సిన వాట్సాప్‌ నంబరు 80085 73171

సమయం: ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు

ఇదీ చదవండి :CJI NV Ramana Tour: ఈనెల 24న స్వగ్రామానికి సీజేఐ ఎన్వీ రమణ.. భారీ ఏర్పాట్లు చేస్తున్న గ్రామస్థులు

ABOUT THE AUTHOR

...view details