విజయవాడలో 'ఈనాడు' ఆధ్వర్యంలో మెగా ప్రాపర్టీ షో - vmc commissioner openee eenadu property show
విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో 'ఈనాడు' ఆధ్వర్యంలో మెగా ప్రాపర్టీ షో నిర్వహించారు. స్టాళ్లను వీఎంసీ కమిషనర్, ఈనాడు యూనిట్ మేనేజర్ ప్రారంభించారు.
రాజధాని ప్రాంతంలో సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునేవారి కోసం... 'ఈనాడు' ప్రాపర్టీ షో నిర్వహించడం మంచి పరిణామమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో 'ఈనాడు' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ప్రాపర్టీ షోను... జిల్లా యూనిట్ మేనేజర్ జీఆర్సీ శేఖర్... రియల్ ఎస్టేట్ సంస్థల యాజమాన్యాలతో కలిసి ప్రారంభించారు. రుణ సదుపాయం అందించేందుకు ముందుకు వచ్చిన ఎస్‌బీఐ, సెంట్రల్ బ్యాంక్ ఇండియాతో పాటు పలు స్టాళ్లను కమిషనర్ ప్రారంభించారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రాపర్టీ షోలో పలు నిర్మాణ సంస్థలు తమ స్టాళ్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి.