ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యార్థిని ఆత్మహత్యపై.. విచారణకు కమిటీ: మంత్రి ఆదిమూలపు - విజయవాడ వార్తలు

ప్రకాశం జిల్లా ఒంగోలులో బీటెక్ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్య ఘటనపై విచారణ కమిటీ వేసినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ ఘటన తనను కలచివేసిందని ఆయన పేర్కొన్నారు.

adimulam suresh  btech student suicide formed a committee
విద్యార్థిని మృతి విచారణకు కమిటీ: మంత్రి ఆదిమూలం

By

Published : Feb 7, 2021, 4:11 PM IST

బీటెక్ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్యపై విచారణ కమిటీ వేసినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విద్యార్థిని మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. సీఎం జగన్ సైతం ఆవేదన చెందారని మంత్రి పేర్కొన్నారు.

ఘటనపై విచారణ జరిపేందుకు ప్రొఫెసర్ యేసు రత్నం, ప్రొఫెసర్ స్వర్ణ కుమారి, ప్రొఫెసర్ స్వరూప రాణితో కమిటీ నియమించినట్టు చెప్పారు. ఘటనపై.. ఈ కమిటీ అన్నికోణాల్లో విచారణ చేసి నివేదిక ఇస్తుందన్నారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details