విశ్వవిద్యాలయాల అధ్యాపకులకు కనీస టైం స్కేల్ అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఉన్నత విద్యామండలి(Education Council on minimum time scale for faculty) ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు-24 అమలులో నెలకొన్న గందరగోళంతోనే ప్రస్తుతం కనీస టైం స్కేల్ అమలులో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. 2015 రివైజ్డ్ పే స్కేల్స్ ప్రకారం అధ్యాపకులకు కనీస టైం స్కేల్ ఇవ్వాలని 2019లో జారీ చేసిన ఉత్తర్వు-24లో పేర్కొన్నారు. ఈ క్రమంలో వర్సిటీ ఉద్యోగులకు యూజీసీ స్కేల్ వర్తిసున్నందున ఎలా వర్తింపచేయాలనే విషయంలో సందిగ్ధత(Chairman Hema Chandra Reddy on minimum time scale) నెలకొందన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో-40 తీసుకొచ్చి ఒప్పంద ఉద్యోగుల గురించి ఆలోచన చేస్తోందని వెల్లడించారు.
వాళ్లను తొలగించబోం..