పర్యవరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది. పండుగలు..వేడుకలు...ఉత్సవాలంటూ ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగానే వినియోగిస్తుంటాం. కనీసం ఈ ఏడాది గణేష్ ఉత్సవాలకైనా రసాయన రంగుల గణనాథుల్ని పక్కనపెడదాం. మట్టి విగ్రహాలు వాడి.. నీరు కాలుష్యం కాకుండా మనవంతు ప్రయత్నిద్దాం. అందుకు సిద్ధంగా...మట్టి ప్రతిమలు కనువిందు చేస్తున్నాయి. విజయవాడ ఎంజీ రోడ్డులోని భూమి ఆర్గానిక్స్ పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రయత్నిస్తూ..మట్టి విగ్రహాలు విక్రయిస్తోంది. డిమాండ్ పెరుగుతోందని నిర్వహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
'పూజించండి..మట్టి లంబోదరుడిని..!' - ganesh celebrations in andhrapradesh
వినాయక చవితి సమీపిస్తోంది..నగరాల్లో మట్టి ప్రతిమలు కనువిందు చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే జనాల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతోందని..అందుకే మట్టి విగ్రహాలకు డిమాండ్ కూడా పెరిగిందని వ్యాపారులు ఆనందం వ్యక్తం చేశారు.
'పూజించుడి..మట్టి లంబోదరుడిని..!'