FIR against MLA Raja Sing: భాజపా తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని.. ఆ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం, మీడియాతో మాట్లాడే విషయంలో కూడా ఈసీ నిషేధం విధించింది. యూపీ ఎన్నికల సందర్భంగా యోగి ఆదిత్యానాథ్‌కు మద్దతుగా రాజాసింగ్ విడుదల చేసిన వీడియోనే ఇందుకు కారణం. ఈ వీడియో విషయంలో ఇప్పటికే రాజాసింగ్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వీడియో సందేశంపై వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌ను ఈసీ బుధవారం ఆదేశించింది. విధించిన గడువు లోపల వివరణ ఇవ్వకపోవటం వల్లే ఎఫ్ఐఆర్కు ఈసీ ఆదేశించింది.
నోటీసులు ఎందుకు ఇచ్చిందంటే..
యూపీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు వీడియోలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఓటర్లను బెదిరించినట్టుగా ఉన్నాయని ఈసీ పేర్కొంది. రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.
నోటీసులపై రాజాసింగ్ ఎమన్నారంటే..