అధికారి పేరు | జిల్లా |
పి.రామ కృష్ణ | కృష్ణా |
బీఎన్ఎన్ మూర్తి | గుంటూరు |
ఎం. శివ ప్రసాద్ | కర్నూలు |
ఆర్. యశోదా బాయి | శ్రీకాకుళం |
అలాన్ చోంగ్ టెరోన్ | వై ఎస్సార్ కడప |
సి.సెల్వం | తూర్పుగోదావరి |
డాక్టర్ శేఖర్ బాబు గెడ్డం | ప్రకాశం |
కుమారి నందిని సలేరియా | విశాఖపట్నం |
జగన్నాథ్ సింగ్ | చిత్తూరు |
అనంత్ శంకర్ | పశ్చిమగోదావరి |
నరేంథరన్.జీజీ | అనంతపురం |
సందీప్ కృపాకర్ గుండాలా | విజయనగరం |
సునీల్ కుమార్ | నెల్లూరు |
వ్యయ పరిశీలకులతో భేటీ
ఎన్నికల వ్యయ పరిశీలకులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల్లో అభ్యర్థులు, పార్టీల ఖర్చులపై నిఘా పెట్టాలని ఆదేశించారు. ప్రతిరోజు క్షేత్రస్థాయిలో ఎన్ని కేసులు నమోదయ్యాయి. వాటి వివరాలు తెలియచేయాలని ఆదేశించారు. ర్యాలీలు, బైక్ర్యాలీలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విధి నిర్వహణలో తటస్థంగా, నిష్పాక్షికంగా ఉండాలని ఆదేశించారు. వెంటనే కేటాయించిన జిల్లాల్లో బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించే దిశగా దృష్టి సారించాలని ఆదేశించారు.