ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీఫ్, వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన ఆయన సీఎంతో భేటీ అయ్యారు. డిసెంబరు 4న విశాఖలో జరిగే నేవీ డే వేడుకలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఫిబ్రవరి 2022లో జరగనున్న పీఎఫ్‌ఆర్ అండ్ మిలన్ -2022 నిర్వహణకు సంబంధించిన సన్నాహాల పురోగతిని ముఖ్యమంత్రికి వివరించారు. ఈఎన్‌సీ ఫ్లాగ్ ఆఫీసర్ అజేంద్ర బహదూర్ సింగ్‌ను సన్మానించిన జగన్..జ్ఞాపికను అందజేశారు. ముఖ్యమంత్రి జగన్ను కలిసిన వారిలో నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్ వీఎస్‌సీ రావు, కెప్టెన్ వికాస్ గుప్తా, సివిల్ మిలటరీ లైజన్ ఆఫీసర్ కమాండర్ సుజిత్ రెడ్డి, ఫ్లాగ్ లెఫ్టినెంట్ శివమ్ కందారి ఉన్నారు.
Navi Officers Meet CM: సీఎం జగన్తో నేవీ అధికారుల మర్యాదపూర్వక భేటీ - సీఎం జగన్తో తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీఫ్ మర్యాదపూర్వక భేటీ వార్తలు
తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీఫ్, వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్.. సీఎం జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబరు 4న విశాఖలో జరిగే నేవీ డే వేడుకలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.
![Navi Officers Meet CM: సీఎం జగన్తో నేవీ అధికారుల మర్యాదపూర్వక భేటీ సీఎం జగన్తో తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీఫ్ మర్యాదపూర్వక భేటీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13554298-587-13554298-1636118915625.jpg)
సీఎం జగన్తో తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీఫ్ మర్యాదపూర్వక భేటీ