ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

kedareshwar temple: ఈ గుడిని ఏడాదికి ఒక్కరోజు మాత్రమే తెరుస్తారు... ఎక్కడంటే? - తూర్పు గోదావరి జిల్లా తాజా సమాచారం

kedareshwar temple: సాధారణంగా దేవాలయాలు ఏడాది పాటు తెరుచుకుని ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఆలయాన్ని తెరిచి భక్తులకు దర్శనభాగ్యం కలిగిస్తారు. ఇలా ఎందుకు జరుగుతుందో, దీని విశిష్టత ఏమిటో తెలుసుకుందామా?

kedareshwar temple
కేదారేశ్వర ఆలయం

By

Published : Mar 1, 2022, 4:43 PM IST

kedareshwar temple: ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శనం లభించే అతి ప్రాచీనమైన శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయంలో మహాదేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పురాతమైన దేవాలయం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో కొలువై ఉంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు.

కేదారేశ్వర ఆలయం

ఆలయ చరిత్ర

తూర్పు చాళుక్యుల కాలంలో బిక్కవోలు గ్రామంలోని గోలింగేశ్వర స్వామి గ్రామంలోని నలుదిక్కుల నాలుగు శివాలయాలు నిర్మించారు. వాటిలో ఒకటైన జైన దేవాలయంలో కేదారేశ్వరుడు కొలువై ఉన్నాడు. అప్పుడు జరిగిన యుద్ధాలలో ఈ ఆలయంలోని శివలింగం ధ్వంసం కావడంతో ఆలయం మూతపడింది. తిరిగి ఆలయాన్ని తెరిచి సంవత్సరానికి ఒక రోజు మాత్రమే, అదీ మహా శివరాత్రి పర్వదినాన భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా వేకువజాము నుంచే స్వామివారిని దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం కిటకిటలాడుతోంది.

ఇదీ చదవండి: Water Problem: శ్రీశైలం పాతాళగంగలో నిలిపివేసిన పుణ్యస్నానాలు.. ఆవేదనలో భక్తులు

ABOUT THE AUTHOR

...view details