హైదరాబాద్‌లో మూడుసార్లు కంపించిన భూమి - earth quakes three times in hyderabad latest news
హైదరాబాద్‌లో మళ్లీ భూప్రకంపనలు బెంబేలెత్తించాయి. బీఎన్‌రెడ్డి నగర్, వైదేహీనగర్ కాలనీలో వరుస భూప్రకంపనలు వచ్చాయి. తెల్లవారుజామున 5.40 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది.

హైదరాబాద్‌లో మూడుసార్లు కంపించిన భూమి
ఉదయం 6.45 గం.కు వైదేహీనగర్ కాలనీలో మరోసారి పెద్దశబ్దంతో భూమి కంపించింది. ఉదయం 7.08 గంటలకు మూడోసారి భూప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు వెల్లడించారు. మూడుసార్లు ప్రకంపనలు రావడం వల్ల ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు.