ఈ ఏడాది జూన్ 24న ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వెలువడింది. జులై 1 నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. జులై 27 నుంచి ఆగస్టు ఒకటో తేదీ వరకు అభ్యర్థులు ఎంపికకు అవకాశం కల్పించారు. శనివారం అభ్యర్థులకు కళాశాల కేటాయింపు పూర్తి చేసినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి కన్వీనరు ప్రకటన జారీ చేశారు.
ఎంసెట్ తొలివిడత సీట్ల కేటాయింపు పూర్తి - b pharmacy
రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ సీట్ల భర్తీకి సంబంధించి తొలివిడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 64.84 శాతం ఇంజనీరింగు సీట్లు భర్తీ కాగా.... 5.8 శాతం ఫార్మసీ సీట్లకు ఆప్షన్లు ఎంచుకున్నారు.
ప్రైవేటులో 62.8 శాతమే
ఎంసెట్-2019 ప్రవేశ పరీక్షకు హాజరైన వారిలో 1,32,953 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇందులో 68,134 మంది ప్రొసెసింగ్ ఫీజు చెల్లించారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం 67,505 మంది అర్హత సాధించారు. ఇందులోనూ 64,369 మంది మాత్రమే ఆప్షన్లు ఎంచుకున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో విశ్వవిద్యాల్లోని 19 కళాశాలలకు కన్వీనరు కోటా కింద ఉన్న 5,448 సీట్లకు భర్తీ అయిన సీట్లు 5,275 మాత్రమే. ఇంకా 173 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 255 ప్రైవేటు కళాశాలల్లో 62.8 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.
స్పోర్ట్స్ అభ్యర్థుల కోసం రిజర్వు
ఫార్మసీ విభాగంలో యూనివర్సీటీలోని ఎనిమిది కళాశాలల్లో 227 సీట్లు ఉండగా-50 మాత్రమే భర్తీ అయ్యాయి. ప్రైవేటులోని 108 కళాశాలల్లో 3,266 కళాశాలలకు 154 సీట్లు భర్తీ కాగా-3,112 సీట్లు ఖాళీగా ఉన్నాయి. రెండు విభాగాల్లోని మొత్తం సీట్లలో 480 ప్రత్యేక కేటగిరీ పేరిట స్పోర్ట్స్ అభ్యర్థుల కోసం రిజర్వు చేశారు.