ఇంజినీరింగ్ కోర్సుల ఎంపికకు ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు 71,366 మంది విద్యార్థులు ఐచ్ఛికాలను నమోదు చేసుకున్నారని ఉన్నత విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఎంసెట్‌లో మొత్తం 1,29,714మంది అర్హత సాధించగా... ధ్రువపత్రాల పరిశీలనకు 89,783మంది నమోదు చేసుకున్నారు. వీరిలో 88,583 మంది కోర్సులు, కళాశాలల ఎంపికకు అర్హత సాధించారు. జనవరి 1 వరకు ఐచ్ఛికాల నమోదు, మార్పులకు అధికారులు అవకాశం కల్పించారు.
ఇంజినీరింగ్ కోర్సుల కోసం 71,366మంది విద్యార్థుల ఐచ్ఛికాల నమోదు - ఉన్నత విద్యాశాఖ తాజా వార్తలు
బుధవారం సాయంత్రం 6 గంటల వరకు ఇంజినీరింగ్ కోర్సుల ఎంపిక కోసం 71,366 మంది విద్యార్థులు ఐచ్ఛికాలు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇంజినీరింగ్ కోర్సుల కోసం 71,366మంది విద్యార్థులుు ఐచ్ఛికాల నమోదు