ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పంచాయతీ ఎన్నికలపై ఫిర్యాదులకు 'ఈ వాచ్' యాప్​ - ఈ వాచ్ యాప్ లాంచ్ వార్తలు

పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఎస్​ఈసీకి ఉన్న అభిప్రాయాన్ని అత్యంత సుస్పష్టంగా చెప్పినా..కొందరు పెడార్ధాలు తీస్తున్నారని.. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అన్నారు. ఎక్కువ సంఖ్యలో ఏకగ్రీవాలు జరగడం శ్రేయస్కరం కాదని ఆయన పునరుద్ఘాటించారు. అదే సమయంలో ఎన్నికల తీరును పరిశీలించేందుకు నిఘా యాప్‌ను ఈ ఉదయం 11 గంటలకు ఆవిష్కరిస్తున్నట్లు చెప్పారు.

e watch app will launch tomorrow
e watch app will launch tomorrow

By

Published : Feb 2, 2021, 9:13 PM IST

Updated : Feb 3, 2021, 6:46 AM IST

పంచాయతీ ఎన్నికలపై ఫిర్యాదులకు 'ఈ వాచ్' యాప్​

పల్లె పోరులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల సన్నద్ధత, నిర్వహణపై.. కలెక్టర్లు, అధికారులతో..ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్లు పక్కాగా చేశారని ప్రశంసించారు. ఇదే సమయంలో ఏకగ్రీవాలకు ఎన్నికల సంఘం వ్యతిరేకం అన్నట్లుగా ప్రచారం జరుగుతుందన్న ఆయన....అది అవాస్తవమని తేల్చిచెప్పారు. పోటీ ఎక్కువగా ఉండి, ప్రజలందరూ ఎన్నికల్లో భాగస్వామ్యులు అవ్వాలని....అందుకు ఏకగ్రీవాలు అడ్డుకాకూడదనే చెప్పానని స్పష్టంచేశారు. ఇందులో ఎలాంటి సంశయం లేదన్నారు.

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల తీరును పరిశీలించేందుకు రూపొందించిన ప్రత్యేక నిఘా యాప్‌ "ఈ వాచ్‌”ను ....నేడు ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఎన్నికల సంఘం కార్యాలయంలో ఆవిష్కరించనున్నారు. ఈ యాప్‌ ద్వారా ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఇతరాత్రా సమస్యలు నేరుగా ఎస్​ఈసీకి తెలియజేసే అవకాశం అందుబాటులోకి రానుంది.

ఎన్నికల్లో ప్రత్యేక పరిశీలకుడిగా పాల్గొనాలని....తెలంగాణ మాజీ ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డిని...ఎస్​ఈసీ అహ్వానించింది. మాజీ ఎస్​ఈసీతో పాటు అధికారిగా వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం, సేవలు....పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఉపయోగించుకోవాలని నిమ్మగడ్డ భావిస్తున్నారు. అదే సమయంలో నేడు ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయా జిల్లాల అధికారులతో సమావేశమై....ఎన్నికల సన్నద్ధత, ఏర్పాట్లపై సమీక్షించనున్నారు.

ఇదీ చదవండి:నిమ్మాడలో అచ్చెన్నాయుడు అరెస్టు.. రెండు వారాల రిమాండ్

Last Updated : Feb 3, 2021, 6:46 AM IST

ABOUT THE AUTHOR

...view details