సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఈ- రక్షాబంధన్ కార్యక్రమాన్నినేడు ప్రారంభించనున్నారు. ఏపీ సీఐడీ విభాగం, సైబర్ పీస్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టాయి. ఈ నెలాఖరు వరకు అవగాహన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఆన్‌లైన్ భద్రతా అవగాహన, రేడియో ప్రోగ్రామ్స్, నిపుణులతో సైబర్ చర్చలు జరగనున్నాయి. సర్వేలు, క్విజ్, రచన పోటీలు వంటి కార్యక్రమాలనూ నిర్వహించనున్నారు.
నేడు ఈ- రక్షాబంధన్ ప్రారంభించనున్న సీఎం జగన్ - ఈ రక్షాబంధన్ తాజా వార్తలు
ఈ- రక్షాబంధన్ పేరుతో ఏపీ సీఐడీ విభాగం, సైబర్ పీస్ ఫౌండేషన్ సంయుక్తంగా.. సైబర్ సేఫ్టీపై నేడు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను పోలీసులు విడుదల చేశారు.
e rakshabhandhan will start august 3