ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రయాణికులకు ఈ-పాస్ తప్పనిసరి : డీజీపీ సవాంగ్

కర్ఫ్యూ సమయంలో ఆంధ్రప్రదేశ్​లోకి ప్రవేశించే ప్రయాణికులు తప్పనిసరిగా ఈ-పాస్​ను కలిగి ఉండాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ప్రభుత్వం పేర్కొన్న అత్యవసర సేవలకు ఈ-పాస్ అవసరం లేదన్నారు.

e-pass mandatory for entry in andhrapradhesh
డీజీపీ సవాంగ్

By

Published : May 25, 2021, 12:11 AM IST

ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్​కు రావాలంటే ఈ-పాస్ తప్పనిసరి అని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాష్ట్రంలోకి వచ్చే వారికి ఈ-పాస్ లు అవసరం లేదన్న డీజీపీ... మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏపీలోకి వచ్చే ప్రయాణికులు ఈ-పాస్​ను కచ్చితంగా కలిగి ఉండాలని స్పష్టం చేశారు. సంబంధిత ప్రభుత్వ వెబ్​సైట్ల ద్వారా ఈ-పాస్​ను పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వం పేర్కొన్న అత్యవసర సేవలకు ఈ-పాస్ అవసరం లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్​కు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటకల్లో కర్ఫ్యూ, లాక్​డౌన్ అమలులో ఉన్నందున ఆయా రాష్ట్రాల్లోకి ప్రవేశించాలంటే సంబంధిత రాష్ట్రాలు జారీ చేసిన ఈ-పాస్​ను కలిగి ఉండాలని సూచించారు. ఇతర రాష్ట్రాలకు అంబులెన్స్​లో ప్రయాణించే వారికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ద్వారా సహాయసహకారాలు అందిస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు.

ఇదీచదవండి.

'కొవాగ్జిన్​కు త్వరలోనే డబ్ల్యూహెచ్​ఓ అనుమతులు!'

ABOUT THE AUTHOR

...view details