Challans on kamareddy collector vehicle: ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు ఈ- చలాన్లతో హడలెత్తిస్తున్నారు. ఇలాంటి వాటిలో ప్రభుత్వ వాహనాలు సైతం ఉంటున్నాయి. తెలంగాణలోని కామారెడ్డి కలెక్టర్ వాహనం(టీఎస్ 16 ఈఈ 3366)పై భారీ మొత్తంలో ఈ-చలాన్లు ఉన్నాయి. 2016 నుంచి 2021 ఆగస్టు 20 వరకు 28 చలాన్లు వేశారు. మొత్తం రూ.27,580 జరిమానా పడింది. ఇందులో 24 సార్లు అతివేగంగా వాహనం నడపడం వల్లే చలాన్లు విధించడం గమనార్హం.
ఓ బైక్పై117 చలాన్లు
చలాన్లు కట్టకుండా తప్పించుకొని తిరురుగుతున్న ద్విచక్ర వాహనదారుడు మహ్మద్ ఫరిద్ ఖాన్ చివరికి ఇలా చిక్కాడు. హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా తనిఖీలు చేస్తున్న అబిడ్స్ పోలీసులు (hyderabad traffic police) ఓ యాక్టివా వాహనాన్ని ఆపారు. ఆ వాహనంపై ఏమైనా చలాన్లు ఉన్నాయోమోనని తనిఖీ చేయగా.. పెండింగ్ చలాన్లు వస్తూనే ఉన్నాయి. ఒకవేళ మెషీన్ ఏమైనా పాడైపోయిందా అని చెక్ చేసుకున్నారు. లేదు అవన్నీ ఆ వాహనంపై ఉన్న పెండింగ్ చలాన్లేనని నిర్ధరించి.. అవాక్కయ్యారు (pending challans vehicle seize). ఆ బైక్పై ఒకటా రెండా.. ఏకంగా 117 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి మరి. 117 పెండింగ్ చలాన్లు ఉన్న హోండా యాక్టివాను పోలీసులు సీజ్ చేశారు. వాటి విలువ మొత్తం రూ.30 వేలు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించారు.
పెండింగ్ చలాన్లపై ప్రత్యేక దృష్టి
ఇటీవల కాలంలో పోలీసులు పెండింగ్ చలాన్లపై(e challan ts) ప్రత్యేక దృష్టిసారించారు. కూడళ్లలో వచ్చే పోయే ప్రతీ వాహనాన్ని పరిశీలిస్తున్నారు. అనుమానం ఉంటే వెంటనే ఆపి చలానాలు తనిఖీ చేస్తున్నారు. వీలైనంత వరకు అక్కడికక్కడే చలానా వసూలు చేస్తున్నారు. వేయి రూపాయల కంటే ఎక్కువ బాకీ ఉంటే వాహనదారులు ఖచ్చితంగా మీ-సేవలో కానీ, ఆన్లైన్లో కానీ పేమెంట్ చేసినట్లుగా చూపిన తరువాతే వాహనం అప్పగిస్తున్నారు.