''కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలే పాటిస్తున్నాం'' - ఎన్నికల సంఘం
కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యంతరంపై.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది స్పందించారు. తాము ఎవరి పక్షాన వహించడం లేదని.. కేంద్ర ఎన్నికల సంఘ సూచనలు మాత్రమే పాటిస్తున్నామని చెప్పారు.
సీఈఓ ద్వివేది
ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యంతరాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది స్పందించారు. ఎన్నికల సంఘం ఎవరి పక్షాన పని చేయడం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు అంటే గౌరవం ఉందని చెబుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు మాత్రమే అమలు చేస్తున్నామన్నారు. ఎవరి తరఫున పనిచేయాలని ఎలాంటి ఉత్తర్వులు ఎన్నికల సంఘం తమకు ఇవ్వలేదని తేల్చి చెప్పారు. ఎన్నికల నిర్వహణలో నిష్పాక్షికంగా పనిచేస్తున్నామన్న ద్వివేది... తమ మీద ఎవరి ఒత్తిడి లేదనన్నారు.