AUDIO VIRAL: "గడప గడపకు మన ప్రభుత్వం" పేరుతో వైకాపా సర్కార్ చేపట్టిన కార్యక్రమానికి.. హాజరుకావాలంటూ డ్వాక్రా మహిళలపై ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ఈ క్రమంలో.. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో.. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఈ కార్యక్రమాని చేపట్టారు. ఇందులో పాల్గొనాలని ఓ డ్వాక్రా మహిళకు ఫోన్ చేశారు. ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి హాజరుకాలని ఒత్తిడి చేశారు. దాంతో సదరు మహిళ ఎదురు తిరిగి.. "పథకాలు తీసుకుంటే ప్రభుత్వ కార్యక్రమాలకు రావాలా?" అంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డ్వాక్రా మహిళ మాట్లాడుతున్న విధానం బట్టి.. ఆమె విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిందని.. అక్కడ బ్లాక్ మెయిల్ రాజకీయాలు జరుగుతున్నాయని పలువురు మహిళలు ఆరోపిస్తున్నారు.
పథకాలు తీసుకుంటే.. ప్రభుత్వ కార్యక్రమాలకు రావాలా?.. మహిళ ఆడియో వైరల్ - విజయవాడ తాజా వార్తలు
AUDIO VIRAL: వైకాపా సర్కార్ చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో.. డ్వాక్రా మహిళలు పాల్గొనాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఓ డ్వాక్రా మహిళకు ఫోన్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పథకాలు తీసుకుంటే.. ప్రభుత్వ కార్యక్రమాలకు రావాలా?.. మహిళ ఆడియో వైరల్