ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన దసరా నవరాత్రి ఉత్సవాలు - Dussehra celebrations in prakasham district

రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో దసరా(navaratri celebrations) మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య పూజలు ప్రారంభించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన దసరా నవరాత్రి ఉత్సవాలు
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన దసరా నవరాత్రి ఉత్సవాలు

By

Published : Oct 7, 2021, 10:07 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన దసరా నవరాత్రి ఉత్సవాలు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో జ్ఞాన ప్రసూనాంబ దేవి సన్నిధికి ఎదురుగా బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. ఆలయానికి అనుబంధంగా కొండపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చారణలు మధ్య శాస్త్రోక్తంగా పూజలు ప్రారంభించారు.

విశాఖ జిల్లాలో...

విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న సన్నిధిలో దసరా(dusshera celebrations) ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వైదికులు గరుడవాహనంపై స్వామి వారిని అధిష్టింపచేసి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ శారదాపీఠంలో రాజ శ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. మహా గణపతి పూజతో అంకురార్పణ చేశారు. తొలిరోజు రాజశ్యామల అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారి అవతారంలో దర్శనమిచ్చారు.

శ్రీకాకుళం జిల్లాలో...

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో కోట దుర్గమ్మ(durga matha news) నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన తొలి పూజలు శాసనసభ్యులు విశ్వాసరాయి కళావతి, డీసీసీబీ మాజీ అధ్యక్షులు పాల్గొన్నారు. అమ్మవారి నిజరూపాన్ని శాసనసభాపతి తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు.

నెల్లూరు జిల్లాలో...

నెల్లూరు జిల్లాలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ రాజరాజేశ్వరి(rajarajeshwari temple) అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. తొలిరోజు చండీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో...

ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల లోని శ్రీ అంకమ్మతల్లి దేవాలయంలో దసరా శరన్నవమి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి... నవరాత్రులలో భాగంగా రోజుకో అలంకరణలో అంకమ్మతల్లి అమ్మవారు భక్తులకు దర్శనమియనున్నారు...తొలిరోజు శ్రీ బాలాత్రిపురసుందరి దేవి అవతారం లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు..ముందుగా దేవాలయ పూజారి అళహరి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో అంకమ్మతల్లి అమ్మవారికి వేద మంత్రోత్సరణలమధ్య అభిషేకం నిర్వహించారు.

ప్రముఖ పుణ్యక్షేత్రం మైన జిల్లా త్రిపురాంతకం లోని బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయం లో దేవి శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రుల సందర్భంగా ఆలయన్నీ అందంగా ముస్తాబు చేశారు. మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు.

తూర్పుగోదావరి జిల్లాలో...

శరన్నవరాత్రి ఉత్సవాలు తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ఆలయాల వద్ద భక్తులు పూజలు నిర్వహించారు. దుర్గాదేవి అమ్మవారిని పలు ఆలయాల వద్ద సుందరంగా అలంకరించారు. అమలాపురంలోని శ్రీ దేవి అమ్మవారి ఆలయంతో పాటు కోనసీమ వ్యాప్తంగా ఆలయాల్లో భక్తజనం పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

ప్రత్తిపాడు మండలం ఓమ్మంగి గ్రామంలోని దుర్గాదేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి..గ్రామంలో మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పించారు.

ఇదీ చదవండి:

కార్పొరేషన్‌ పేరిట ప్రభుత్వం రుణం తీసుకోవడంపై అభ్యంతరం.. హైకోర్టు ఏమందంటే?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details