ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంద్రకీలాద్రిపై చురుగ్గా దసరా ఉత్సవ ఏర్పాట్లు - ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల నిర్వహణకు మరో 2 వారాల సమయమే ఉన్నందున... ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. ఈనెల 17 నుంచి 25 వరకు దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.

ఇంద్రకీలాద్రిపై చురుగ్గా దసరా ఉత్సవ ఏర్పాట్లు
ఇంద్రకీలాద్రిపై చురుగ్గా దసరా ఉత్సవ ఏర్పాట్లు

By

Published : Oct 3, 2020, 5:29 PM IST

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రుల నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. కరోనా వ్యాప్తి కొనసాగుతున్నా... ఈ నెల 17 నుంచి 25 వరకు దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు చర్యలు ప్రారంభించారు. మంత్రి వెల్లంపల్లి ఆదేశాల మేరకు... అమ్మవారి ఆలయ ప్రాకారాలకు రంగులతో శోభాయమానంగా అలంకరిస్తున్నారు.

ఆలయ ప్రాంగణంలో రంగవల్లికలు దిద్దుతున్నారు. కొండపై నుంచి ఘాట్‌ రోడ్డు మీదుగా క్యూలైన్లు నిర్మిస్తున్నారు. పబ్లిక్‌ మైక్‌ అనౌన్సెమెంట్‌, అదనపు సీసీ కెమేరాల ఏర్పాటు తదితర పనులు చకచకా పూర్తి చేస్తున్నారు. కొండపై ప్రధాన ఆలయం, గోపురాలు, ప్రాకార మండపాలతో పాటు దిగువన ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details