వేకువ జామున 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మవారి దర్శనానికి అనుమతించినట్లు దుర్గగుడి ఈవో సురేష్ బాబు వెల్లడించారు. 13 వేల మందికి ఆన్ లైన్ ద్వారా టికెట్లు జారీ చేశామన్నారు. రద్దీ తక్కువగా ఉన్న సమయంలో పరిమిత సంఖ్యలో అప్పటికప్పుడు టికెట్లు జారీ చేస్తామన్నారు. మధ్యాహ్నం 3.40 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని సురేష్ బాబు తెలిపారు.
సరస్వతి దేవిగా అమ్మవారి దర్శనం - విజయవాడ దుర్గాగుడి దేవి నవరాత్రులు తాజా వార్తలు
మూలా నక్షత్రం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు బుధవారం సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిస్తారని ఆలయ ఈవో సురేష్ బాబు తెలిపారు. దర్శనానికి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
సరస్వతి దేవిగా అమ్మవారి దర్శనం