దుర్గగుడిలో వీఐపీలకు సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు సమయం కేటాయించినా.. రాత్రి 8 గంటల వరకు అనుమతించడంపై భక్తులు నిరసన వ్యక్తం చేశారు. వీఐపీల పేరిట తమను గంటల కొద్దీ క్యూలైన్లలో నిలిపి వేస్తున్నారని తెలిపారు. ఆలయంలోకి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నా.. అమ్మవారి దర్శనానికి గంటల కొద్ది వేచి చూడాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వీఐపీలకు కేటాయించిన సమయంలోనే దర్శనాలు కల్పించి సాధారణ భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.
దుర్గగుడిలో వీఐపీ దర్శనాలపై భక్తుల ఆందోళన - దుర్గగుడిలో వీఐపీల దర్శనాలపై భక్తుల ఆగ్రహం వార్తలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో వీఐపీలు, సహా వారి పేరిట వచ్చిన వారికి అధికారులు అధిక ప్రాధాన్యత కల్పించడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గంటల కొద్ది వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
దుర్గగుడిలో వీఐపీ దర్శనాలపై భక్తుల ఆందోళన